దర్శకుడిగా మారబోతున్న'ధృవ' విలన్!

- May 10, 2018 , by Maagulf
దర్శకుడిగా మారబోతున్న'ధృవ' విలన్!

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకప్పుడు 'రోజా' చిత్రం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అరవింద్ స్వామి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో వచ్చినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. చాలా కాలం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన అరవింద్ స్వామి 'కడల్‌' సినిమాతో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న అరవింద్ స్వామి తనీ ఒరువన్‌ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్ అరవింద్‌ స్వామి తరువాత ఆ సినిమాకు తెలుగు రీమేక్‌ గా తెరకెక్కిన 'ధృవ'లోనూ అదే పాత్రలో నటించి మెప్పించారు. 

ఇప్పటికీ నవ యవ్వనంగా కనిపించే అరవింద్ స్వామి విలన్ గా నటించడంలో ఏమాత్రం ఇబ్బంది లేదని..పాత్రకు సరైన న్యాయం చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమని అంటున్నారు. ప్రస్తుతం శతురంగవేట్టై, నరకసూరన్‌, వనంగాముడి సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత‍్వంలో సెక్క సివంద వానం సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా 'భాస్కర్‌ ఒరు రాస్కెల్‌' సినిమాలో నటించారు అరవింద్ స్వామి.. ఇందులో అమలా పాల్‌ కథానాయిక. మలయాళ దర్శకుడు సిద్ధిక్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది.

ఆ మద్య రాజకీయాల గురించి మాట్లాడుతూ..తనకు రాజకీయాలు అస్సలు తెలియవని..నేను రాజకీయాల గురించి మాట్లాడటంగానీ, రావడంగానీ జరగదు. అయితే.. రాజకీయ నాయకుల నిర్ణయాలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపితే స్పందిస్తా'' అన్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందర్నీ మా సినిమా అలరిస్తుంది అన్నారు. 

ప్రస్తుతం నటుడిగా ఫుల్‌ బిజీగా కొనసాగుతూనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు అరవింద్‌ స్వామి. ఇప్పటికే కథ రెడీ చూసుకున్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com