శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం ' నో '
- May 11, 2018
దివంగత నటి శ్రీదేవి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ సునీల్ సింగ్ అనే దర్శకనిర్మాత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సీజే దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. శ్రీదేవి మరణం అనుమానాస్పదంగా ఉందని. అందువల్ల విచారణ జరిపించాలని సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన ఇదే విషయం మీద సుప్రీంకోర్టుకెక్కాడు.
గత ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని ఓ లగ్జరీ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి ' ప్రమాదవశాత్తూ మునిగి ' మరణించిన విషయం తెలిసిందే. స్పృహ కోల్పోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారని అక్కడి ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. కాగా. శ్రీదేవి పేరిట ఆమెకు ఒమన్ లో రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే ఆమె మరణిస్తే ఆ సొమ్మును రిలీజ్ చేస్తారని పిటిషనర్ తరఫు లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఇదే అంశంపై గతంలోనే దాఖలైన రెండు పిటిషన్లను తాము తోసిపుచ్చామని, ఇక జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







