అబుదాబి:పెట్రోల్ స్టేషన్స్‌లో సెల్ఫ్ సర్వీస్ ట్రయల్
- May 11, 2018
అబుదాబి:మోటరిస్టులు అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్ ప్రీమియమ్ సర్వీస్‌ని 40 స్టేషన్లలో జూన్ 28 వరకు ఉచితంగా పొందేందుకు వీలుంది. గత నెలలో, అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్ సెల్ఫ్ సర్వీస్ మరియు ప్రీమియమ్ లేన్స్‌పై తమ ప్లాన్స్‌ని విడుదల చేసింది. వాహనాల్లో పెట్రోల్ పోయించుకునేందుకు అటెండెంట్ కావాల్సి వస్తే, అందుకు కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది. అయితే ఇది ఎంత మొత్తంలో అనేది మాత్రం వెల్లడించలేదు. ట్రయల్ పీరియడ్‌ని వచ్చే నెల వరకు పొడిగించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. అడ్నాక్ ఫ్లెక్స్ పేరుతో ఈ కొత్త సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్ 18 నుంచి ఇప్పటిదాకా 40 పెట్రోల్ స్టేషన్స్‌లో సుమారు 157,000 మంది తమ వాహనాల్ని పెట్రోల్ కోసం తీసుకెళ్ళినట్లు సంస్థ వెల్లడించింది. వీరిలో 69 శాతం వినియోగదారులు ప్రీమియమ్ సర్వీస్‌ని వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







