ఆమె అంతిమ యాత్రకు కూడా రాని ఆ టాప్ హీరోలు
- May 11, 2018
'మహానటి' మూవీకి వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ ఈమధ్య కాలంలో ఏసినిమాకు రాలేదు. ఆఖరికి చరిత్ర సృష్టించిన 'బాహుబలి' ని విమర్శించిన వారు కొందరైనా ఉన్నారు కాని 'మహానటి' మూవీని విమర్శించే ఒక్కరు కూడ కనిపించడం లేదు. ఇలాంటి ఏకగ్రీవ ఆమోదం ఈమధ్య కాలంలో ఎసినిమాకు రాలేదు అన్నది వాస్తవం.
ఇలాంటి పరిస్థుతులలో 'మహానటి' సినిమాను చూసి బయటకు వస్తున్న కొందరు ప్రేక్షకులు ఆనాటి ఆ ఇద్దరు టాప్ హీరోల పేర్లను ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ సావిత్రితో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను చేసిన సావిత్రి సమకాలీనులు అయిన ఇద్దరు ఇండట్రీ దిగ్గజాలు సావిత్రి సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు అన్న ప్రశ్నలు వేస్తున్నారు. వాస్తవానికి సావిత్రి చనిపోయి 36 సంవత్సరాలు గడిచిపోవడంతో ఆమె గురించి పూర్తిగా తెలిసినవారు ఇప్పటి తరంలో ఎవరూలేరు.
దీనికితోడు ఈసినిమాను చూస్తున్న ప్రేక్షకులలో చాలామంది 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అవ్వడంతో వారందరికీ సావిత్రి జీవితం కొత్తగా కనిపిస్తోంది. దీనితో సావిత్రి జీవితంలో జనాలకు తెలియని కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ మహానటి జీవిత చరమాంకంలో పడిన కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా నటించిన కీర్తి సురేష్ అభినయం సమంత నెరేషన్ అన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈసినిమాను చూస్తున్న అనేకమంది ఆడియన్స్ థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు పైకి ఏడవలేని వాళ్లు కన్నీరును ఆపుకుంటున్నారు.
అయితే సావిత్రి అంతటి కష్టాలు పడుతుంటే అప్పటి ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న సావిత్రికి అత్యంత సాన్నిహిత్యం ఉన్న కొందరు హీరోలు ఆమెను ఎందుకు పట్టించుకోలేదు అంటూ కొందరు ఈసినిమా చూసిన తరువాత ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు పెద్ద హీరోలు అనే గుర్తింపు మాత్రమే ఉంటే సరిపోదు కాసింత పెద్ద మనసు కూడా ఉండాలి అంటూ తమతమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సావిత్రితో నటించిన చాలామంది టాప్ హీరోలు ఆమె అంతిమ యాత్రకు కూడ రాలేదు అంటే ఆరోజులలో సావిత్రి ఆత్మ ఎంతగా క్షోభించి ఉండి ఉంటుందో అర్థం అవుతుంది..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..