సీవేజ్‌ పిట్‌లో పడి చిన్నారి మృతి

- May 11, 2018 , by Maagulf
సీవేజ్‌ పిట్‌లో పడి చిన్నారి మృతి

మస్కట్‌: నార్త్‌ బతినాలోని ఓ ఇంట్లోగల సీవేజ్‌ పిట్‌లో పడి చిన్నారి మృతి చెందింది. పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. సంఘటన గురించి సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్‌ డిఫెన్స్‌ రెస్క్యూటీమ్‌, చిన్నారిని సీవేజ్‌ పిట్‌ నుంచి అతి కష్టమ్మీద బయటకు తీసింది. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com