బాలిస్టిక్ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్ చేసిన సౌదీ
- May 12, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్సెస్, శుక్రవారం మరో బాలిస్టిక్ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్ చేశాయి. హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి ఈ మిస్సైల్‌ని సంధించినట్లు సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. కోలిషన్ అధికార ప్రతినిథి టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, సౌదీ అరేబియాలోని జజాన్ ప్రాంతం లక్ష్యంగా మిస్సైల్ దాడికి తీవ్రవాదులు యత్నించినట్లు చెప్పారు. ఎక్కువ మంది జనాభా వున్న ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనీ, వాటిని సమర్థవంతంగా తాము తిప్పి కొడ్తున్నామని అల్ మాలికి వివరించారు. సౌదీ అరేబియా, అలాగే గల్ఫ్ రీజియన్‌లోనూ, ఆ మాటకొస్తే ప్రపంచ శాంతికి తీవ్రవాదం పెను విఘాతంగా మారిందని అల్ మాలికి ఆరోపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..