క్వీన్‌ ఎలిజబెత్‌ని కలిసిన కింగ్‌ హమాద్‌

- May 12, 2018 , by Maagulf
క్వీన్‌ ఎలిజబెత్‌ని కలిసిన కింగ్‌ హమాద్‌

లండన్‌:కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా, క్వీన్‌ ఎలిజెబెత్‌-2తో సమావేశమయ్యారు. యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విండ్సర్‌ గ్రేట్‌ పార్క్‌ ఎండ్యురన్స్‌ విలేజ్‌లో ఈ సమావేశం జరిగింది. ఇంటర్నేసనల్‌ రాయల్‌ విండ్సర్‌ హార్స్‌ షో సందర్భంగా ఈ భేటీ జరిగింది. డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌, ప్రిన్స్‌ ఆండ్రూ సహా పలువురు ప్రముఖులతోనూ భేటీ అయ్యారు కింగ్‌ హమాద్‌. కింగ్‌ హమాద్‌ - ఎలిజిబెత్‌-2 మధ్య వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలకు ఈ భేటీ ఉపయోగపడ్తుందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com