అమృతసర్: వయస్సు 18 నెలలు..బరువు 29 కేజీలు

- May 12, 2018 , by Maagulf
అమృతసర్: వయస్సు 18 నెలలు..బరువు 29 కేజీలు

లెప్టిన్‌ అనే హార్మోన్ లోపం వలన 18 నెలల పాప 29 కేజల బరువు పెరిగింది. అమృతసర్ కు చెందిన దంపతులు వైద్యం కోసం విజయవాడకు వచ్చారు. వయసుకు మించిన బరువు ఉండటంతో పాప శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పంజాబ్ రాష్ట్రం అమృతసర్ కు చెందిన సూరజ్‌కుమార్‌ కు ప్రార్ధన తో వివాహం జరిగింది. ప్రార్థనకు ,మొదటి కాన్పులో బాబు పుట్టి రోజులవ్యవధిలోనే చనిపోయాడు. ఆ తరువాత  రెండవ కాన్పులో చాహత్‌ జన్మించింది.  పుట్టిన నెల రోజులకే పాప ఎక్కువ బరువుతో పుట్టింది క్రమంగా అది కాస్త 18 నెలల్లోనే 29 కేజీలకు చేరింది. ఈ క్రమంలో  పలు ఆసుపత్రిలలో చికిత్స చేయించారు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు చికిత్స సెంటర్ల కోసం యూట్యూబ్ లో వెతకడం ప్రారంభించారు. ప్రస్తుతం విజయవాడలోని బేరియాట్రిక్ సర్జరీ సెంటర్ ను ఆశ్రయించారు. పాపను పరిశీలించిన డాక్టర్లు పాపకు లెప్టిన్‌ హార్మోన్ లోపం ఉన్నట్టు గుర్తించారు. ఇటువంటి లోపం ఉన్నవారు తక్కువ ఆహరం తిన్నా విపరీతమైన బరువు పెరుగుతారని చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com