బాలిస్టిక్‌ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్‌ చేసిన సౌదీ

- May 12, 2018 , by Maagulf
బాలిస్టిక్‌ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్‌ చేసిన సౌదీ

సౌదీ అరేబియా:సౌదీ అరేబియా ఎయిర్‌ డిఫెన్సెస్‌, శుక్రవారం మరో బాలిస్టిక్‌ మిస్సైల్‌ని ఇంటర్‌సెప్ట్‌ చేశాయి. హౌతీ తీవ్రవాదులు యెమెన్‌ నుంచి ఈ మిస్సైల్‌ని సంధించినట్లు సౌదీ అరేబియా ఎయిర్‌ డిఫెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కోలిషన్‌ అధికార ప్రతినిథి టుర్కి అల్‌ మాలికి మాట్లాడుతూ, సౌదీ అరేబియాలోని జజాన్‌ ప్రాంతం లక్ష్యంగా మిస్సైల్‌ దాడికి తీవ్రవాదులు యత్నించినట్లు చెప్పారు. ఎక్కువ మంది జనాభా వున్న ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనీ, వాటిని సమర్థవంతంగా తాము తిప్పి కొడ్తున్నామని అల్‌ మాలికి వివరించారు. సౌదీ అరేబియా, అలాగే గల్ఫ్‌ రీజియన్‌లోనూ, ఆ మాటకొస్తే ప్రపంచ శాంతికి తీవ్రవాదం పెను విఘాతంగా మారిందని అల్‌ మాలికి ఆరోపించారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com