ఎస్‌సిసి పోల్స్‌కు ఎమిరేటీస్ రిజిస్టర్ తప్పనిసరి
- December 07, 2015
షార్జా కన్సల్టేటివ్ కౌన్సిల్ (ఎస్‌సిసి) ఎన్నికల్లో తమ రిప్రెజెంటేటివ్స్‌ని ఎన్నుకునేందుకు ఎమిరేట్ ఝార్జాలోని ఓటర్లు షార్జా మున్సిపాలిటీ మరియు ఇతర కేంద్రాల్లోతప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల సౌకర్యార్ధం ఆరు రిజిస్ట్రేషన్ కేంద్రాలను షార్జాలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. షార్జా మున్సిపాలిటీ, షార్జాసిటీతోపాటు ధాయిద్, ఖోర్ఫక్కన్, కల్బా, దిబ్బా అల్ హిస్న్, హమ్రియా, మలీహా, మదమ్ మరియు అల్ బతీహాలో ఈ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలనీ, అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలనే పాలకుల నిర్ణయానికి ఈ ఎన్నికలు నిదర్శనమని అధికారులు చెప్పారు. ఓటర్లంతాతమకు నిర్దేశించిన కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓటు హక్కు పొందాల్సిందిగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







