11 కార్ల దహనం: నిందితుడి అరెస్ట్‌

- May 13, 2018 , by Maagulf
11 కార్ల దహనం: నిందితుడి అరెస్ట్‌

దుబాయ్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ యెదుట 11 వాహనాలు ధ్వంసమయిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. ఉద్దేశ్యపూర్వకంగానే వాహనాలకు నిందితుడు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌ ఔట్‌లెట్‌ మాల్‌ యెదురుగా ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిందితుడు, స్టాఫ్‌ మెంబర్స్‌ని షాపింగ్‌ మాల్‌కి తరలించే డ్రైవర్‌. సహచరులతో వాగ్యుద్ధం అనంతరం నిందితుడు వాహనాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో ఆ మంటలు మరో 10 కార్లకు వ్యాపించాయి. విచారణలో తొలుత దగ్ధమైన కారుని గుర్తించి, ఆరా తీయగా ఆ కారులో ఎలాంటి ఫ్లేమబుల్‌ ఐటమ్స్‌ లేవని నిర్ధారించి, నిందితుడ్ని అనుమానించారు. విచారణలో నిందితుడు, తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికీ ఈ ఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com