డ్రగ్‌, ఆల్కహాల్‌ స్మగ్లింగ్‌: ముగ్గురి అరెస్ట్‌

- May 14, 2018 , by Maagulf
డ్రగ్‌, ఆల్కహాల్‌ స్మగ్లింగ్‌: ముగ్గురి అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ముగ్గురు విదేశీయుల్ని డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, ఆల్కహాల్‌ బెవరేజెస్‌ పొసెషన్‌ నేరాల నేపథ్యంలో అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ మరియు సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌, ఓ ఆసియా జాతీయుడ్ని మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేసింది. అతని నుంచి 8 బ్యాగ్‌ల మరిజువానా డ్రగ్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరో కేసులో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - బిద్‌బిద్‌, సమైల్‌లలో ఇద్దరు ఆసియా జాతీయుల్ని ఆల్కహాల్‌ పొసెషన్‌ నేరానికి పాల్పడినందుకుగాను అరెస్ట్‌ చేశారు అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ పోలీసులు. వీరి నుంచి 160 బాటిల్స్‌కి పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్నీ జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com