ప్రముఖ నటుడి హఠాన్మరణం.. వీడియో హల్చల్
- May 14, 2018
బాలీవుడ్ నటుడు ‘ఇందర్ కుమార్’ గతేడాది గుండెపోటుతో చనిపోయారు.ఇందర్ కుమార్ మరణానికి ముందు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. దీంతో అతను గుండెపోటుతో చనిపోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఇప్పుడు బాలీవుడ్లో వార్త హల్చల్ చేస్తుంది. తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇందర్ తానే స్వయంగా ఈ వీడియో తీసుకున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.
ఈ వీడియోలో ఆయన బాగా డ్రింక్ చేసిన మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఇందులో తెలిపాడు. నటుడు కావలనే ఫ్యాషన్‌తో ముంబై వచ్చి, చెడు అలవాట్లకు బానిస అవ్వడంతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని తెలిపాడు. అందుకే తను జీవితాన్ని ఇలా ముగించాల్సి వస్తుందన్నాడు. ఈ వీడియోలో చివరగా తన తల్లిదండ్రులను క్షమించమని కోరాడు.
1996లో ఇందర్ కుమార్ తన తొలి చిత్రం మసూమ్‌తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అనేక చిత్రాల్లో సల్మాన్ ఖాన్‌కు సహ నటుడిగా నటించాడు ఇందుర్.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







