రామ్ జగన్ కాపాడిన హీరో శ్రీకాంత్

- December 07, 2015 , by Maagulf
రామ్ జగన్ కాపాడిన హీరో శ్రీకాంత్

జగన్ అంటే వైఎస్ జగన్ అనుకుంటే పప్పులు కాలువేసినట్లే..మీము చెప్పేది నటుడు రామ్ జగన్ గురించి.శ్రీకాంత్ హీరోగా ఊరికి మొనగాడు అనే చిత్ర షూటింగ్ లో జరిగిన ఓ ఘటన గురించి రామ్ జగన్ ఇటివల ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. 'ఆ చిత్ర షూటింగ్ ..రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరుగుతుండగా, హీరో శ్రీకాంత్ ఆ పక్కనే సరదాగా ఈత కొడుతున్నాడు ..కేవలం నడుం లోతు మాత్రమే నీళ్ళు ఉండడం తో నేను కూడా ఆ నీళ్ళలో ఈత కు వెళ్ళాను, కానీ ఆ సమయం లో నాకు ఈత రాదు, నీళ్ళు తక్కువగా ఉన్నాయని దిగాను. కానీ నేను దిగిన ప్లేస్ లో పెద్ద లోంత ఉంది , దాంతో ఒక్కసారిగా నేను మునిగిపోయాను, నేను మునగడం చూసిన శ్రీకాంత్ మొదట్లో ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడని భావించాడు , కానీ నేను నీజంగానే మునగడం తో వెంటనే వచ్చి నన్ను కాపాడాడు, అలా అప్పుడు శ్రీకాంత్ కాపాడకపోతే నేను ఇప్పుడు మీ ముందు నిలబడే వాన్ని కాదు' అని రామ్ తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com