కిడ్నాప్ కు గురైన భారతీయ ఇంజనీర్లు
- May 15, 2018
అఫ్గానిస్థాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్ కు గురయ్యారు. వివరాల ప్రకారం... ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ పవర్ ప్లాంట్‌లో ఈ ఏడుగురు భారతీయులు పనిచేస్తున్నారు. నిర్వహణలో భాగంగా పవర్‌ప్లాంట్‌కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారు. అఫ్గాన్ వాహన డ్రైవర్ భయంతో బస్సును నిలిపివేశాడు. ఏడుగురు ఇంజినీర్లతో సహా డ్రైవర్ ను కూడా కిడ్నాప్ చేశారు దుండగులు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. భారత ఇంజినీర్లను విడిపించేందుకు తగిన చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







