'మహానటి' స్ఫూర్తితో రాజ్ ముందడుగు

- May 15, 2018 , by Maagulf

`పెళ్ళి చూపులు` హిట్ తో లైమ్ లైట్ లొక్కొచ్చాడు నిర్మాత రాజ్ కందుకూరి. అంతకముందు నిర్మించిన `గోల శీను`, `లవ్ సైకిల్` చిత్రాలు పెద్ద డిజాస్టర్లు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని భావించి పెళ్ళి చూపులతో ఆ డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. ఆ వెంటనే `మెంటల్ మదిలో` సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడే ఏకంగా `మహానటి` స్ఫూర్తితో అందాల సౌందర్య జీవితాన్నే తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నా ప్రతిష్టాత్మకంగా తీయాలనుకుంటున్నాడుట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సౌందర్య అప్పట్లో పెద్ద స్టార్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా సుపరిచితురాలు. తెలుగులో డైహార్డ్ ఫ్యాన్స్ ఉండేవారు. ఇతర భాషల్లో కన్నా తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసారు. ఈనేపథ్యంలో ఆమె హఠాన్మరణం టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్ద షాక్. అలాంటి స్టార్ జీవితానికిప్పుడు దృశ్యరూపం ఇవ్వబోతున్నాడు రాజ్.
 
హ్యాండిల్ చేయగలడా?
రాజ్ కందుకూరితో సినిమాలు చేయాలంటే పెద్ద చిక్కే ఉంటుంది. ఆయనతో సినిమా అంటే కోటి రూపాయల బడ్జెట్ లోపే. అంతకు మించి రూపాయి కూడా పెట్టడు. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో తెలిపాడు. సినిమా క్వాలిటీ కూడా అలాగే ఉంటుందనుకోండి. అలా ఎందుకంటే? కోటిలో సినిమా తీసి హిట్ కొట్టినోడే మోనగాడు అన్నట్లు ఓ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. కానీ సౌందర్య జీవితాన్ని కోటి రూపాయలతో తేల్చే వ్వవహారం కాదు. కథపై చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. బాల్యం నుంచి పెరిగి పెద్దవ్వడం..అటుపై ఎలా సినిమాల్లోకి వచ్చింది? అనంతరం ఆమె రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? ఆమె మరణం. ఇలా చాలా విషయాలను లోతుగా ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలా అంటే? కోటి లో అయ్యే ప్రాజెక్ట్ కాదిది. ఇలాంటి కథలకు మూడు నుంచి ఐదు కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. అదీ సింపుల్ గా తీయాలనుకుంటే. భారీ స్టార్ క్యాస్టింగ్ తో నిర్మాణ అంటే పది కోట్లు ఖర్చు ఖాయం. మరి దీన్ని రాజ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో? ఆయన కూడా రైటర్ కమ్ డైరెక్టర్. మరీ ఛాన్స్ ఆయనే తీసుకుంటాడా? లేక? సీనియర్ డైరెక్టర్లకు ఇస్తాడా? అన్నది తెలియాలి.
 
ఆ నిర్ణయమే ఆమె పాలిట మృత్యువు!
ముఖ్యంగా సౌందర్య మరణం పై చాలా ఊహాగానాలున్నాయి. ఆమెది హత్యా? విధి వంచిందా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. నటిగా పీక్స్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే సౌందర్య మనసు రాజకీయాలవైపు మళ్లింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి మద్ధతిస్తూ కరీనంగర్ జిల్లాలో ప్రచారం చేయడానికి సౌందర్య అన్నయ్య అమర్ తో కలిసి బయల్దేరారు. అవే ఆమె చివరి క్షణాలు. బెంగుళూరులో మధ్నాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రయాదంలో సౌందర్య కన్ను మూయాల్సి వచ్చింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక? రాజకీయ కుట్ర అన్నది ఇప్పటికీ తేలని మిస్టరీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com