హంగ్ దిశగా కర్ణాటక ఫలితాలు
- May 15, 2018
బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి. కన్నడ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు. అధికారం చేపట్టాలంటే 112 సీట్లు సాధించాల్సి ఉండగా.. అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపా 105 సీట్లకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 58 స్థానాల్లో గెలుపొంది.. 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ మరో 7 సీట్ల దూరంలో నిలిచింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో గెలుపొంది 52 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 11 స్థానాల్లో గెలుపొంది.. 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో అధికారం చేపట్టేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కింగ్ మేకర్ నిలిచే అవకాశం కనిపిస్తోంది.
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపాకు జేడీఎస్ మద్దతిస్తే యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పటు కానుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని అంత సులువుగా వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. భాజపా అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. తాము ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది కీలకంగా మారింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







