ఒబెసిటీ సర్జరీలపై మినిస్ట్రీ హెచ్చరిక
- May 15, 2018మనామా: బరువు తగ్గించుకోవడం కోసం సులువైన మార్గంగా సర్జరీలను ఆశ్రయిస్తున్నారు కొందరు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సర్జరీలపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైతం బరువు తగ్గించే సర్జరీల పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. సర్జరీల కారణంగా ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నట్లు మినిస్ట్రీ గుర్తించింది. ఒబెసిటీని తగ్గించేందుకు సహజమైన మార్గాలు ఎన్నో వున్నాయనీ, ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం చెయ్యడం వంటివాటి ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చనీ మినిస్రీ& టాఫ్ హెల్త్ చెబుతోంది. ఒబెసిటీ సర్జరీలు ఖచ్చితంగా ట్రెయిన్డ్ సర్జికల్ టీమ్ నేతృత్వంలోనే జరగాలనీ, స్పెషలైజ్డ్ కమిటీ - మల్టిడిసిప్లినరీ టీమ్ సంయుక్తంగా సర్జరీపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందనీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేస్తోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







