యూఏఈలో వర్షం: తగ్గిన ఉష్ణోగ్రతలు
- May 15, 2018
సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు యూఏఈలోని పలు ప్రాంతాల్లో పడుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం దుబాయ్, అబుదాబీలోని షామ్, ఖోర్ ఖువైర్, అల్ నఖీల్, ఘాలియా తదితర ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉమ్ అల్ కువైన్‌లోని అల్ రప్ఫాలో కూడా వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్‌సిఎం తెలిపింది. వర్షం కారణంగా యూఏఈలో వాతావరణం ఆహ్లాదంగా మారింది. అత్యల్పంగా 17 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఈ వాతావరణం గురు, శుక్రవారాల్లో కూడా కొశ్రీనసాగే అవకాశముంది. సముద్ర తీర ప్రాంతాలు కొంత రఫ్‌గా వుండొచ్చు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







