115 మంది టెర్రరిస్టులకు జైలు
- May 16, 2018
మనామా: జుల్ఫికర్ బ్రిగేడ్ అనే టెర్రరిస్ట్ సంస్థకి చెందిన 115 మంది టెర్రిస్టులకు 3 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్షల్ని ఖరారు చేసింది న్యాయస్థానం. వీరి పౌరసత్వాన్ని సైతం న్యాయస్థానం రద్దు చేసింది. ఈ 115 మందిలో 53 మందికి జీవిత ఖైదు విధించారు. ముగ్గురికి 15 ఏళ్ళ జైలు శిక్ష, ఒకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 15 మందికి ఏడేళ్ళ జైలు శిక్ష, 37 మందికి ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసిందని చీఫ్ ప్రాసిక్యూటర్, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హమాద్ షహీన్ చెప్పారు. ఈ కేసు నుంచి 23 మంది అనుమానితులకు నిర్దోషులుగా ఊరట కల్పించింది న్యాయస్థానం. 138 మంది సభ్యులతో తీవ్రవాద సంస్థను నడుపుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 83 మంది నిందితుల్ని వారి డిఫెన్స్ లాయర్స్ సమక్షంలో విచారించడం జరిగింది. ఇందులో ఆరుగురు మినహా మిగతావారంతా తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







