44 ఏళ్ళలో 178 దేశాలకోసం యూఏఈ ఛారిటీ
- December 07, 2015
యూఏఈ గడచిన 44 ఏళ్ళలో 173 బిలియన్ దిర్హామ్‌లను ఛారిటీ కింద సుమారు 178 దేశాలకు కేటాయించింది. 44వ నేషనల్ డే సందర్భంగా ఈ వివాసరల్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ మరియు డెవలప్మెంట్ (మికాడ్) ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మరియు చారిటీ సంస్థల 1971 నుంచి 2014 మధ్య ఈ నిధుల్ని ఖర్చు చేశాయి. యూఏఈ జాతి పిత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పిలుపు మేరకు ఈ ఛారిటీ కార్యక్రమాలు జరిగాయి. 129 బిలియన్ దిర్హామ్‌లు కేవలం ప్రభుత్వ సంస్థల నుంచే ఛారిటీకి వెళ్ళగా, 30.5 బిలియన్ దిర్హామ్‌లు అబుదాబీ డెవలప్మెండ్ ఫండ్ ద్వారా, 5.7 బిలియన్ దిర్హామ్‌లు ఎమిరేట్ రెడ్ క్రిసెట్ ద్వారా 2.9 బిలియన్ దిర్హామ్‌లు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్ ద్వారా కేటాయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆసియాలో 79.4 బిలియన్ దిర్హామ్‌లను వెచ్చించడం జరిగింది. తర్వాతి స్థానంలో ఆఫ్రికా 75.4 బిలియన్ దిర్హామ్‌లు అందుకున్న ఖండంగా నిలిచింది. గృహ నిర్మాణాలు, రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ జనరేషన్ వంటి విభాగాల్లో ఈ మొత్తాన్ని ఎక్కువగా ఖర్చు చేశారు.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







