గో ఎయిర్ 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్ల..
- December 07, 2015
బడ్జెట్ క్యారియర్గా పేరొందిన విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న క్రిస్మస్ పండగ సీజన్ సందర్భంగా 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం వరకు అందుబాటులో ఉంటుంది. సేల్ సందర్భంగా టిక్కెట్లు కొనుక్కున్న వారు 2016, సెప్టెంబరు 30వ తేదీలోపు ప్రయాణించవచ్చు. బుకింగ్లు చేసుకునే వారిలో ప్రతి 25వ కొనుగోలుదారుడూ ఉచిత విమాన టిక్కెట్లను గెలుచుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తున్న విమాన యానసంస్థల్లో గో ఎయిర్ ఒకటి. ఈ సంస్థ గత నెలలో మూడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టిక్కెట్ ప్రారంభ ధర రూ.691గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







