దొంగతనం కేసులో క్లీనర్‌ అరెస్ట్‌

- May 18, 2018 , by Maagulf
దొంగతనం కేసులో క్లీనర్‌ అరెస్ట్‌

మనామా: 41 ఏళ్ళ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు బహ్రెయిన్‌ ఇంటర్నేసనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కంపెనీ తరఫున క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 10000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన జ్యుయెలరీని నిందితుడు దొంగనతం చేశాడని అధికారులు వివరించారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందుతుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినట్లు బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని సంబంధిత సెక్యూరిటీ డైరెక్టరేట్‌కి అప్పగించారు. ఈ కేసుని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com