ఇఫ్తార్‌ క్యాంపెయిన్‌: 30,000 మీల్స్‌ అందించనున్న దుబాయ్‌ పోలీస్‌

- May 18, 2018 , by Maagulf
ఇఫ్తార్‌ క్యాంపెయిన్‌: 30,000 మీల్స్‌ అందించనున్న దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌ పోలీస్‌, హ్యూమన్‌ రైట్స్‌ డిపార్ట్‌మెంట్‌ 'ఇఫ్తార్‌ ఆర్‌ ది ఫాస్టింగ్‌' క్యాంపెయిన్‌లో భాగంగా పవిత్ర రమదాన్‌ మాసంలో 30,000 మీల్స్‌ని అందించనుంది. ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. లేట్‌ ఒబెయిద్‌ అల్‌ హెలోవు కుటుంబం సహకారంతో డిపార్ట్‌మెంట్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 30,000 మందికి ఈ రమదాన్‌లో మీల్స్‌ అందిస్తారు. ఫాస్టింగ్‌ చేసే డ్రైవర్లకు వీటిని అందజేస్తామని బ్రిగేడియర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ ముర్ర్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ ది హ్యూమన్‌ రైట్స్‌ డిపార్ట్‌మెంట్‌ - దుబాయ్‌ పోలీస్‌) చెప్పారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్‌ అల్‌ ముర్ర్‌, ఒబెయిద్‌ అల్‌ హెలోవు కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com