నాని, నాగ్‌ల మ‌ల్టీ స్టార‌ర్ విడుదలకు సిద్ధం

- May 19, 2018 , by Maagulf
నాని, నాగ్‌ల మ‌ల్టీ స్టార‌ర్ విడుదలకు సిద్ధం

నాని, నాగ్ కాంబినేష‌న్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం కోసం స్పెష‌ల్‌గా వేసిన‌ కాల‌నీ సెట్‌లో ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్నట్టు తెలుస్తుంది. నాని స‌ర‌స‌న ఛ‌లో ఫేం రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తే, నాని డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రం వినాయ‌క చివితి శుభాకాంక్ష‌ల‌తో సెప్టెంబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని న‌టించిన కృష్ణార్జున యుద్ధం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఆఫీస‌ర్ విడుదల కావ‌లసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com