హైదరాబాద్:ప్రముఖ నటుడి వస్త్ర దుకాణంలో చోరీ
- May 19, 2018
సినీ నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. ముగ్గురు మహిళలు దృష్టి మరల్చి ఖరీదైన మూడు చీరలను తీసుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు ఉత్తేజ్‌కు ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరుతో వస్ర్తాల దుకాణం ఉంది. దీన్ని ఆయన సతీమణి పద్మావతి నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చారు. చీరలను చూస్తునట్టు నటించి, పద్మావతి దృష్టి మరల్చి మూడు చీరలను తీసుకొని పారిపోయారు. వీటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని ఉత్తేజ్ సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







