'సాహో' ప్రభాస్‌ అబుధాబి సంగతులు

- May 20, 2018 , by Maagulf
'సాహో' ప్రభాస్‌ అబుధాబి సంగతులు

అబుధాబి:యంగ్‌ రెబల్‌ స్టార్‌, 'బాహుబలి' ప్రభాస్‌ తొలిసారిగా అబుధాబిలో సందడి చేస్తున్నాడు. అదీ తన కొత్త సినిమా 'సాహో' కోసం. అబుదాబిలోని ప్రముఖ ప్రార్థనామందిరం షేక్‌ జాయెద్‌ మాస్క్‌ అలాగే లావ్ర్‌ మ్యూజియంలను తరచూ సందర్శిస్తున్నాడు. రికార్డు స్థాయిలో అత్యధిక రోజులపాటు అబుధాబిలో షూటింగ్‌ చేస్తోన్న దరిమిలా, ప్రభాస్‌ సహా 'సాహో' టీమ్‌ ప్రత్యేకమైన అనుభూతికి గురవుతున్నారక్కడ. అబుధాబి అంటే షవరామాకి ఫేమస్‌. ప్రభాస్‌ తనకు తానే ట్రీట్‌ ఇచ్చుకుంటున్నాడట షవరామాతో. చాలా ఇష్టమైన ఫుడ్‌గా షవరామా మారిపోయిందని ప్రభాస్‌ అంటున్నాడు. 'సాహో' సినిమా విశేషాలకొస్తే, హాలీవుడ్‌ స్టంట్‌ మేన్‌ కెన్నీ బేట్స్‌ దర్శకత్వంలో యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా 30 శాతం రియల్‌, 70 శాతం కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో యాక్షన్‌ సీన్స్‌ చేసెయ్యాలని తొలుత ప్లాన్‌ చేశారట. అయితే హాలీవుడ్‌ స్టంట్‌ మేన్‌ కెన్నీ బేట్స్‌ సూచనతో ఆ నిర్ణయం మార్చుకుని, 90 శాతం రియలిస్టిక్‌గా యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరించేస్తున్నారట. 27 రియల్‌ కార్లను యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం ధ్వంసం చేయాల్సి వచ్చింది. అయితే నిర్మాత మొత్తం ధ్వంసమైన కార్లు 37 అని వెల్లడించారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని తెరకెక్కించడం కోసం, సినిమాని రియలిస్టిగ్‌గా చూపించాలన్న ఆలోచనలో భాగంగానే ఈ రిస్క్‌ తీసుకుంటున్నామని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాహో'లో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ అందాల భామ శ్రద్ధా పూర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెల్సిందే. యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో శ్రద్ధా కపూర్‌ కూడా పాలుపంచుకుంటోంది. ఎడారి ప్రాంతాల్లో తక్కువ శాతం షూటింగ్‌ చేయనున్నారు. అబుధాబి సిటీ మెయిన్‌ రోడ్స్‌ మీదనే ఎక్కువ భాగం చిత్రీకరన జరుగుతోందట. 'బాహుబలి' కోసం బరువు పెరిగి, కండలు పెంచిన ప్రభాస్‌, 'సాహో' కోసం కాస్త బరువు తగ్గాడట. యూఏఈలో మీడియాతో ప్రభాస్‌ మాట్లాడుతూ, ఇక్కడి వాతావరణం, ఇక్కడి భవనాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com