ప్రకృతిని ఆస్వాదిస్తూ, శక్తిని పెంచుకుంటూ..చెర్రీ

- May 21, 2018 , by Maagulf
ప్రకృతిని ఆస్వాదిస్తూ, శక్తిని పెంచుకుంటూ..చెర్రీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్రంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

తన భర్త విశేషాలని ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తున్న ఉపాసన తాజాగా రాంచరణ్ కూల్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పచ్చని ప్రకృతి మధ్యలో కాఫీ తాగుతూ రాంచరణ్ కనిపిస్తున్నాడు. ఈ ఫోటో అభిమానులని ఆకట్టుకుంటోంది. షూటింగ్ బ్రేక్ లో రిఫ్రెష్ అవుతూ, తిరిగి శక్తిని పొందుతున్నాడని ఉపాసన తెలిపింది.

షూటింగ్ మధ్యలో రాంచరణ్ విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఫోటోని క్లిక్ మనిపించారు. రంగస్థలం ఘనవిజయం సాధించిన తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రాలపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. బోయపాటి చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com