ఐపిఎల్ ఫైనల్స్ లో 'రోబో 2.0' టీజర్ 2 రిలీజ్..

- May 21, 2018 , by Maagulf
ఐపిఎల్ ఫైనల్స్ లో 'రోబో 2.0' టీజర్ 2 రిలీజ్..

సూపర్‌స్టార్ రజనీకాంత్‌, శంకర్ క్యాంబినేషన్ లో రూపొందిద్దుకుంటున్న మూవీ రోబో 2.0.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా, ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ముగించుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్నది..రూ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో టీజర్ ను ఈ నెల 27వ తేదిన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయింది..అదీ కూడా ఐపిఎల్ ఫైనల్స్ మ్యాచ్ రోజున ఈ టీజర్ ను రిలీజ్ చేసేందుకు దర్శకుడు శంకర్ ప్రయత్నాలు ప్రారంబించాడు.. ఈ ఫైనల్ మ్యాచ్ ముంబై వాంఖేడ్ స్టేడియంలో జరగనుంది.. మ్యాచ్ టైమ్ అవుట్ టైమ్ లో ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com