గల్ఫ్ వీసా పేరుతో ఘరానా మోసం
- May 21, 2018
హైదరాబాద్:గల్ఫ్ వీసా ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకిలో నివాసం ఉంటున్న మహ్మద్ సయీద్ ఖాలిద్‌కు మహ్మద్ అసిఫుద్దీన్ పరిచయమయ్యాడు. తాను హకీంపేటలో తైబా టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నానని, సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసేందుకు వీసాలు ఇప్పిస్తున్నానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహ్మద్ సయీద్ ఖాలిద్ వీసా కోసం రూ. 6లక్షలు అతనికి చెల్లించాడు. అయితే వీసా ఇప్పంచకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. డబ్బులకు గ్యారంటీగా అతని కారు ఆర్‌సీని ఇచ్చాడు. ఇటీవల అసిఫుద్దీన్ దుబాయికి పారిపోయారు. దీంతో బాధితుడు సయీద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







