తాతయ్యను చూసి నటించడం నేర్చుకున్నా
- May 21, 2018
పెద్ద సావిత్రికి ఎంత పట్టుదలో బుల్లి సావిత్రికి కూడా అంతే పట్టుదల. ఆ విషయం మహానటి సినిమాలో సావిత్రి తెలియజేసింది. మరి ఈ బుల్లి సావిత్రి కూడా తన నటన ద్వారా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరించింది. సావిత్రి పెద్దయ్యాక ఆ పాత్రలో నటించిన కీర్తి సురేష్‌కి పేరు వచ్చినట్లే చిన్నారి సావిత్రి పాత్రకుగాను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నిశంకరకు కూడా అంతే పేరు వస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించింది. నిశంకరను ఈ సినిమాలో నీకు అవకాశం ఎలా వచ్చింది అని అడిగితే.. సినిమా డైరక్టర్ నాగ్ అశ్విన్ అంకుల్, నిర్మాత స్వప్న ఆంటీ తాతయ్యను కలవడానికి ఇంటికి వచ్చారు. అప్పుడు నేను మా పప్పీతో ఆడుకుంటున్నాను. తాతయ్యతో మాట్లాడుతున్న వారిద్దరినీ పప్పీతో భయపెట్టాను. నన్నూ చూసిన నాగ్ అంకుల్ మహానటిలో బుల్లి సావిత్రి పాత్రకు సరిగ్గా సరిపోతుందన్నారు. తాతయ్యను అడిగేసరికి వెంటనే ఒప్పేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. సినిమాలో భలే నటించావే.. బాగా అల్లరి చేస్తావనుకుంటా అని అంటే మా తాతయ్య ఇంట్లో ఎలా ఉంటారో నేను కూడా అలాగే ఉంటా. సినిమాలో కూడా అలాగే నటించా. ఆయన నటించిన సినిమాల్లోని కామెడీ సీన్స్, డైలాగ్స్ అన్నీ చెబుతుంటారు. అవి అన్నీ వింటూ, చూస్తూ నేర్చేసుకున్నా అని చెప్పింది. తాతకు తగ్గ మనవరాలు అన్న ప్రశంసల్ని అందుకుంటోంది నిశంకర.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







