జానకికి అరుదైన పురస్కారం
- May 22, 2018
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మాణం తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం అందచేస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును ప్రముఖ గాయని ఎస్ జానకికి అందజేయనున్నారు. శ్రీ విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జానకమ్మ ఆశీస్సులతోనే ఇంత పెద్ద గాయకుడిని అయ్యా ఆమె సత్కరించుకనే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నా’నన్నారు బాలు.
ఎన్నో అద‍్భుత గీతాలతో ప్రేక్షకులను అలరించిన జానకీ 17 భాషల్లో దాదాపు 45000 వేల పాటలు పాడారు. ఇందులో జపనీస్, జర్మన్ లాంటి విదేశీ భాషలు కూడా ఉండటం విశేషం. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను నాలుగు జాతీయ అవార్డులతో పాటు 33 వివిధ రాష్ట్రాల అవార్డులు ఆమెను వరించాయి. 2016లో ఓ మలయాళ చిత్రానికి తన చివరి పాటను ఆలపించిన జానకీ తరువాత రిటైర్మెంట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







