రజనీకాంత్ సినిమాలో సిమ్రాన్
- May 23, 2018సీనియర్ నటి సిమ్రాన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో నటించిన సిమ్రాన్ వివాహమైన తర్వాత మూవీలకు గ్యాప్ ఇచ్చింది..ఇటీవలే ఒక తమిళ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ డైరెక్టర్ పొణరామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమాలో సిమ్రాన్ నటిస్తుంది. ఇందులో విలన్‌గా కనిపించనుంది.. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే రజనీకాంత్ సరసన నటించే గొప్ప ఛాన్స్ ఈ అమ్మడికి దక్కించుకుంది.. రజనీ త్వరలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 168వ సినిమా చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంతో సిమ్రాన్ తొలి సారి రజనీకాంత్‌తో జతకట్టనుందని టాక్. కార్తీక్ సుబ్బరాజు గ్యాంగ్ స్టర్ మూవీగా రూపొందించనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!