నాడు తండ్రి ప్రధానమంత్రి.. నేడు తనయుడు ముఖ్యమంత్రి
- May 23, 2018
బెంగళూరు:దేవెగౌడ, కుమారస్వామి ఇద్దరూ అదృష్ట జాతకులే. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడూ వారిది కింగ్ మేకర్ పాత్రే. అయితే కాలం కలిసి వచ్చిన ప్రతి సారీ వారే కింగ్ అయ్యారు. నాడు తండ్రి దేవేగౌడ ఏకంగా ప్రధానమంత్రి అవగా.. నేడు తనయుడు కుమార స్వామి కింగ్ మేకర్ పొజిషన్ నుంచి కన్నడ సీఎం అయ్యారు. ఫుల్ మెజార్టీ రాకపోయినా సీఎం పదవి వరించడం కుమారస్వామిని వరించడం ఇది రెండోసారి.
జనతాదళ్ సెక్యులర్... దేవేగౌడ స్థాపించిన పార్టీ. ఇప్పటి వరకు కర్ణాటకలో సింగిల్ మెజార్టీ ఎప్పుడూ సాధించలేదు. లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఘనతా లేదు. అయితేనేం అత్యున్నత పదవులు చేపట్టడంలో మాత్రం వారికి టైమ్ బాగా కలిసి వచ్చింది. 1996లో కర్ణాటకలో పట్టుమని 16 ఎంపీ స్థానాలు గెలిచింది జేడీఎస్. అంతే దేవేగౌడ ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు. కింగ్ మేకర్ కాదు కదా... ఏకంగా దేశానికే బాస్ అయ్యారు. 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నారు దేవేగౌడ. 13 పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం, వారంతా కలిసి దేవేగౌడను ప్రధానిగా ఎన్నుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్... యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతిచ్చింది. అయితే ఏడాది తిరగకముందే కాంగ్రెస్ యూ టర్న్ తీసుకుంది. తమ పార్టీని సంప్రదించకుండా దేవేగౌడ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కారణంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రధాని పదవి నుంచి దేవెగౌడ దిగిపోవాల్సి వచ్చింది.
ఇక దేవేగౌడ కుమారుడు కుమారస్వామి విషయంలోనూ ఇలాంటి అదృష్టాలే కలిసి వచ్చాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత ఓట్లు, సీట్లు రాకపోయినా ఇదివరకు బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తాజా ఎన్నికల్లోనూ జేడీఎస్‌కు 37 సీట్లే వచ్చాయి. హంగ్ వస్తే కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని అంతా భావించారు. అయితే బీజేపీని అధికారానికి దూరం పెట్టడం కోసం కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుని, జేడీఎస్‌కు పూర్తి మద్దతిస్తామని ప్రకటించడంతో కుమార స్వామి పంట పండింది.
తండ్రీ కొడుకులైన దేవేగౌడ, కుమార స్వామికి ఇలాంటి రాజయోగం పట్టడం దేశ రాజకీయాల్లో ఎక్కడా జరగలేదు. చిన్న పార్టీ, అతి తక్కువ సీట్లు వస్తున్నా వారికే రాజయోగం పడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలే. ప్రధాన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ మాత్రమే ఉంది. అందుకే హంగ్ పరిస్థితులతో వారికీ రాజయోగం పడుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..