రజనీకాంత్ సినిమాలో సిమ్రాన్
- May 23, 2018
సీనియర్ నటి సిమ్రాన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో నటించిన సిమ్రాన్ వివాహమైన తర్వాత మూవీలకు గ్యాప్ ఇచ్చింది..ఇటీవలే ఒక తమిళ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ డైరెక్టర్ పొణరామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమాలో సిమ్రాన్ నటిస్తుంది. ఇందులో విలన్‌గా కనిపించనుంది.. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే రజనీకాంత్ సరసన నటించే గొప్ప ఛాన్స్ ఈ అమ్మడికి దక్కించుకుంది.. రజనీ త్వరలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 168వ సినిమా చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంతో సిమ్రాన్ తొలి సారి రజనీకాంత్‌తో జతకట్టనుందని టాక్. కార్తీక్ సుబ్బరాజు గ్యాంగ్ స్టర్ మూవీగా రూపొందించనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..