మహానటులను స్ఫూర్తిగా తీసుకోవాలి: హాస్య నటుడు బ్రహ్మానందం
- May 23, 2018
హైదరాబాద్: అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమునలను, ఈతరం నటులు ఆదర్శంగా తీసుకోవాలని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. కాలంతో పాటు కామెడీ మారుతోందని, సమాజాన్నిబట్టి నడుచుకోవల్సిందేనన్నారు. బుధవారం రవీంద్రభారతిలో ప్రజ్ఞా ఆర్ట్స్ (సంగీత సుధా వేదిక), అభినయ కూచిపూడి కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో లలిత కళాపురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రముఖ నటుడు బ్రహ్మానందాన్ని ప్రజ్ఞా పురస్కారంతో సత్కరించారు.
అతిథిగా హాజరైన నటి జమున, ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీ పరిశోధకుడు సంజయ్‌కిషోర్ తదితరులు బ్రహ్మానందాన్ని సత్కరించారు. జమున మాట్లాడుతూ పదకొండు వందల సినిమాల్లో నటించి అభిమాను లను నవ్వించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం అని కొనియాడారు. హాస్యాన్ని పండించడంలో బ్రహ్మానందానికి ఎవరూ సాటి రారని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు సంభవిస్తున్న సమయంలో సినీ ఇండస్ట్రీలో హాస్యం తీరు మారుతోందని అన్నారు. ఈ కాలపు నటీనటులు మహానటులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకెక్కిన గొప్ప నటుడు బ్రహ్మానందం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. సభకుముందు చిన్నారి కళాకారుల 'సంగీత విభావరి' అలరించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







