మరో చిత్రానికి హీరో ధనుష్ దర్శకత్వం
- May 23, 2018
'పవర్పాండి' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. సీనియర్ నటుడు రాజ్కిరణ్తో ధనుష్ చేసిన 'పవర్పాండి' కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దాంతో, ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో 'పవర్ పాండి'కి సీక్వెల్ తీయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హాలీవుడ్ చిత్రంలో ధనుష్ బిజీ అవడంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్ల మెగాఫోన్కు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ధనుష్ మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నా హాలు చేపట్టినట్టు కోలీవుడ్ టాక్. వచ్చే నెలలోనే ఆ సినిమా ప్రారం భమయ్యే అవకాశముందని చెప్పు కుంటున్నారు. అయితే, వేరే ఆ సినిమాలో వేరే హీరో నటిస్తారా లేక ధనుష్ నటిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. కాగా, ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' జూలైలో తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







