సామాజిక కార్యక్రమాలలో సింగపూర్ తెలుగు సమాజం
- May 24, 2018సింగపూర్:సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న సామాజికసేవా కార్యక్రమాలలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఈ నెల 20వ తారీఖున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న సుమారు 50 మంది తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు.సోమ రవి ఆధ్వర్యంలో సభ్యులు కాశి, ప్రసాద్, సమ్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్త దానం శిబిరం నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు మరియు పాల్గొన్న దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞలు తెలిపారు.
అలాగే వివేకానంద సేవా సంఘ్ ఆధ్వర్యం లో పిల్లలకి,పెద్దలకి నిర్వహించే “భారతీయ సాంప్రదాయ ఆటల పండగ - 2018 “ (ITGF-2018) బెడోక్ (Bedok) స్టేడియం లో 19 మే 2018 న జరిగింది. సింగపూర్ తెలుగు సమాజం- మహిళల టీమ్ కుందుళ్ళాట లో ప్రథమ స్థానంలో నిలవగా, పురుషుల టీమ్ ఖోఖో లో ద్వీతీయ స్థానంలో నిలిచింది. తెలుగు మహిళలు రంగోళి లో అత్యధికంగా పాల్గొని సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డు ని సాధించారు. పిల్లల టీమ్స్ కూడా ఖోఖో,కబడ్డీ ఇతర ఫన్ గేమ్స్ లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటిసారి ఎక్కువమంది సమాజం సభ్యులు ITGF లో పాల్గొనడాన్ని వివేకానంద సేవా సంఘ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి సమాజం ప్రతినిధిగా ఈ క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొని గౌరవ అతిథి చెరిల్ చాన్ ,సింగపూర్ పార్లమెంట్ మెంబర్ మరియు జావేద్ అష్రాఫ్ ,భారతీయ హై కమీషనర్ వేదిక పంచుకున్నారు. ITGF కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొని ట్రోఫీలు సాధించి తెలుగు వారు అందరూ గర్వపడేలా చేసిన విజేతలందరినీ, పాల్గొన్న వారినీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి , కార్యదర్శి సత్య చిర్ల మరియు కార్యనిర్వాక సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..