ఎస్‌ఎంసిలో అరుదైన ట్యూమర్ తొలగింపు
- May 25, 2018
మనామా:సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్‌ఎంసి) వైద్యులు, అత్యంత క్లిష్టతరమైన సర్జరీని నిర్వహించి, కంటి నుండి అరుదైన ట్యూమర్‌ని తొలగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆప్తల్మాలజీ మెడికల్ టీమ్ సర్జరీ వివరాల్ని వెల్లడించింది. 60 ఏళ్ళ బహ్రెయినీ పౌరుడి కుడి కన్ను కింది భాగం నుంచి ఈ ట్యూమర్‌ని తొలగించారు. బహ్రెయిన్‌లో ఈ తరహా సర్జరీ ఇదే తొలిసారి అని వైద్యుల బృందం పేర్కొంది. డాక్టర్ మొహమ్మద్ నయిమ్ నాజర్ (ఆప్తల్మాలజీ హెడ్, రెటినల్ సర్జరీ కన్సల్టెంట్) నేతృత్వంలో ఈ సర్జరీ జరిగింది. పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన 48 గంటల్లోనే సర్జరీ నిర్వహించినట్లు వైద్య బృందం వివరించింది. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సర్జరీలో విజయవంతంగా ట్యూమర్‌ని తొలగించారు. సర్జరీ ఆలస్యమైతే ట్యూమర్ సైజ్ పెరిగి, కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడేదని వైద్యులు చెప్పారు. ట్యూమర్ ఏ తరహాదన్న విషయమై పరీక్షలు నిర్వహించేందుకోసం శాంపిల్స్‌ని సేకరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







