రస్ అల్ ఖైమాలో స్పార్ హైపర్ మార్కెట్
- May 25, 2018
రస్ అల్ ఖైమా:గ్లోబల్ సూపర్ మార్కెట్ ఛైయిన్ 'స్పార్', ప్రస్తుతం 47 దేశాల్లో సూపర్ మార్కెట్స్‌ని నిర్వహిస్తోంది. తాజాగా రస్ అల్ ఖైమాలో స్పార్ తమ శాఖను ఏర్పాటు చేసింది. యూఏఈలో ఇది 27వ స్పార్ స్టోర్. రస్ అల్ ఖైమాకి చెందిన ప్రముఖులు షేక్ అహ్మద్ ఐస్సా అల్ నయీమ్, బిజోయ్ థామస్ పులిక్కెల్ (సీఓఓ ఆఫ్ అబుదాబీ కూప్), డేవిడ్ మూరె (ఇంటర్నేషనల్ రిటైల్ డైవలప్‌మెంట్ డైరెక్టర్ స్పార్ ఇంటర్నేషనల్) ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అల్ నయీమ్ మాల్‌లో 8000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ స్పార్ హైపర్ మార్కెట్‌ని ఏర్పాటు చేశారు. 55,000 పైగా ప్రోడక్ట్స్ వినియోగదారుల కోసం అందుబాటులో వుంటాయి. టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, జనరల్ మర్చండైజ్ ఇక్కడ లభ్యమవుతాయి. పలు రకాలైన ఆహార పదార్థాలు, రోస్టెరీ, డేట్స్, తాజా చేపలు, అరబిక్ బేకరీ, ఇంపోర్టెడ్ మరియు స్థానిక మీట్స్, డెలికేటెస్సెన్, అరబిక్ స్నాక్స్, స్వీట్స్ వంటివీ కొలువుదీరాయిక్కడ. రమదాన్ సందర్భంగా వినియోగదారులకు మంచి ఆఫర్స్‌తో అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







