రస్ అల్ ఖైమాలో స్పార్ హైపర్ మార్కెట్
- May 25, 2018రస్ అల్ ఖైమా:గ్లోబల్ సూపర్ మార్కెట్ ఛైయిన్ 'స్పార్', ప్రస్తుతం 47 దేశాల్లో సూపర్ మార్కెట్స్‌ని నిర్వహిస్తోంది. తాజాగా రస్ అల్ ఖైమాలో స్పార్ తమ శాఖను ఏర్పాటు చేసింది. యూఏఈలో ఇది 27వ స్పార్ స్టోర్. రస్ అల్ ఖైమాకి చెందిన ప్రముఖులు షేక్ అహ్మద్ ఐస్సా అల్ నయీమ్, బిజోయ్ థామస్ పులిక్కెల్ (సీఓఓ ఆఫ్ అబుదాబీ కూప్), డేవిడ్ మూరె (ఇంటర్నేషనల్ రిటైల్ డైవలప్మెంట్ డైరెక్టర్ స్పార్ ఇంటర్నేషనల్) ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అల్ నయీమ్ మాల్లో 8000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ స్పార్ హైపర్ మార్కెట్‌ని ఏర్పాటు చేశారు. 55,000 పైగా ప్రోడక్ట్స్ వినియోగదారుల కోసం అందుబాటులో వుంటాయి. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, జనరల్ మర్చండైజ్ ఇక్కడ లభ్యమవుతాయి. పలు రకాలైన ఆహార పదార్థాలు, రోస్టెరీ, డేట్స్, తాజా చేపలు, అరబిక్ బేకరీ, ఇంపోర్టెడ్ మరియు స్థానిక మీట్స్, డెలికేటెస్సెన్, అరబిక్ స్నాక్స్, స్వీట్స్ వంటివీ కొలువుదీరాయిక్కడ. రమదాన్ సందర్భంగా వినియోగదారులకు మంచి ఆఫర్స్‌తో అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..