బహ్రెయిన్‌లో నిపా వైరస్ ఎఫెక్ట్?
- May 26, 2018
బహ్రెయిన్:భారతదేశంలోని కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ కుదిపేస్తోంది. పొరుగున వున్న కర్నాటకతోపాటు, తెలంగాణలోనూ నిపా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ నిపా వైరస్‌కి కారణం గబ్బిలాలేనంటూ జరుగుతున్న ప్రచారంపై కొంత గందరగోళం నెలకొంది. ఇదిలా వుంటే, బహ్రెయిన్‌లో ఫ్రూట్ ట్రేడర్స్ ఇండియా నుంచి వచ్చే పళ్ళను దిగుమతి చేసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిపా వైరస్‌కి కారణమని పేర్కొంటున్న గబ్బిలాలు, పళ్ళను తినే జాతికి చెందినవనీ, ఆ కోణంలో చూస్తే, పండ్లకు నిపా వైరస్‌ని మోసుకెళ్ళే అవకాశం వుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్న దరిమిలా, ట్రేడర్స్‌కి కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిపా వైరస్ వున్న గబ్బిలాలు కొరికిన పండ్లు మాత్రమే ప్రమాదకరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా గబ్బిలాలతో నిపా వైరస్ వస్తోందనడానికి సరైన రుజువులు లేవు కాబట్టి, పూర్తిగా ఇందులో నిజం ఎంతుందనేది తేలాల్సి వుందంటున్నారు. సెంట్రల్ మార్కెట్‌లోని ఫ్రూట్ ట్రేడర్స్ ఆందోళన సంగతి పక్కన పెడితే, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ కూడా నిపా ఔట్ బ్రేక్ నేపథ్యంలో పండ్ల దిగుమతికి సుముఖత వ్యక్తం చేయడంలేదు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







