29నుంచి విదేశాల్లో గోపీచంద్ మూవీ పంతం షూటింగ్..
- May 26, 2018
గోపీచంద్, మెహరీన్ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం పంతం. దీనికి ఫర్ ఎ కాస్ అన్నది ఉపశీర్షిక. లోగడ బలుపు, పవర్, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీ జులై 5వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది..ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్నది.. ఇక మరో షెడ్యూల్ స్కాట్లాండ్, లండన్ లో జరగనుంది.. దీని కోసం ఈ నెల 29వ తేదిన చిత్ర యూనిట్ అక్కడకు బయలుదేరి వెళ్లనుంది.. అక్కడు మూడు సాంగ్స్ తో పాటు కీలక సన్నీవేశాలు చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి మూవీని విడుదలకు సిద్ధం చేస్తారు.. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..