అలనాటి నటి గీత కపూర్ ఇకలేరు..
- May 26, 2018
అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) వృద్ధాశ్రమంలో శనివారం కన్నుమూశారు. అయిన వాళ్ళ ఆదరణకు నోచుకోని గీత కపూర్ ఏళ్ల తరబడి వృద్ధాశ్రమంలో గడిపారు.దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆమె చివరివరకు కొడుకు కూతురి జాడకోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మధ్యలోనే వారిని చూడకుండా మరణించిందని ఆమె అభిమాని అశోక్ పండిట్ వెల్లడించాడు. గీతా కపూర్ కు కొడుకు, కూతురు ఉన్నారని వారు ఆమెను ఆదరించలేదని కొడుకు గీతా కపూర్ ను చిత్రహింసలకు గురిచేసి నాలుగురోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడని దాంతో ఆమె అనారోగ్యం పాలైంది.ఆ సమయంలో ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న తాను ఆసుపత్రి బిల్లులు కట్టి గీతా కపూర్ ను వృద్ధాశ్రమంలో చేర్పించానని అశోక్ పండిట్ అన్నారు.కానీ వృద్ధాశ్రమంలో ఉన్నంతకాలం కొడుకు కూతురుకోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిందని కానీ వారు రాలేదని తీవ్రంగా దుఃక్కించేదని... ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకుని కన్నుమూశారని అన్నారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రిలో ఉంచాం. ఆమె తరుపువారు ఎవరైనా వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని అశోక్ పండిట్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..