జూన్ 14న 'జంబలకిడిపంబ' సినిమా విడుదల..
- May 27, 2018
జంబలకిడి పంబ సినిమా పేరు చెప్పగానే ఈవీవీ.సత్యనారాయణ, నరేష్ చేసిన సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రీనివాస రెడ్డి కథానాయకుడు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సిద్ది ఇద్నాని కథానాయిక, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ కీలక పాత్రధారులు. జెబి. మురళికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం సమకూర్చాడు..ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సతీశ్ ముత్యాల, రచన, దర్శకత్వం జెబి.మురళికృష్ణ, నిర్మాతలు రవి, జోజో జోస్, శ్రీనివాస రెడ్డి. ఎన్, సహ నిర్మాత బి.సురేష్ రెడ్డి. ఇక ఈ మూవీ జూన్ 14వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..