కాంతారావు బయోపిక్ కు శ్రీకారం
- May 27, 2018
కోదాడ : తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తోపాటు ఆగ్రస్థానంలో వెలిగిన కథనాయకుడు, కత్తివీరుడు కాంతారావు బయోపిక్కు ప్రముఖ సినీ దర్శకుడు పీసీ ఆదిత్య శ్రీకారం చుట్టారు. కాంతారావు స్వగ్రామం సూర్యాపేట జిల్లా గుడిబండను ఆయన సందర్శించారు. కాంతారావు నివసించిన ఇంటిని పరిశీలించారు. కాంతారావు సమకాలికులతో ముచ్చటించి, పలు అంశాలను సేకరించారు. 250చిత్రాల్లో నటించిన ఆయన 100చిత్రాల్లో హీరోగా చేశారు. ఆయన బయోపిక్ తీయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆదిత్య తెలిపారు. ఆయన జీవిత చరిత్ర సినిమాకు 'అనగనగా ఓ రాకుమారుడు' అనే పేరు నిర్ణయించిన్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారు, స్నేహితులు ఆయన బయోపిక్ తెలిపే ఫొటోలు పలు అంశాలను తెలియజేయాలనుకునే వారు తన (9705317188)ను సంప్రదించాలని ఆయన సూచించారు. త్వరలోనే ముహుర్తాన్ని నిర్ణయించి ఆయన వర్ధంతి వచ్చే ఏడాది మార్చి 22న సినిమాను పూర్తిచేసి ప్రేక్షకులకు అందించనున్నట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్