ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ - ప్రకటించిన బాలకృష్ణ

- May 27, 2018 , by Maagulf
ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ - ప్రకటించిన బాలకృష్ణ

ఎన్టీ రామారావు జీవితంపై నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా నిర్మిస్తున్న సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తారు . ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు . మహానటుడు ఎన్టీ రామారావు జన్మదినోత్సవం సందర్భంగా బాలకృష్ణ ఓ వీడియో , పోస్టర్ను విడుదల చేశారు . ఆదివారం సాయంత్రం వీటిని బాలకృష్ణ విడుదల చేశారు . వీడియోలో బాలకృష్ణ స్వయంగా మాట్లాడారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చింది . ఆ సినిమా ఘన విజయం సాధించింది . ఇప్పుడు క్రిష్ తో బయోపిక్ చేయడం ఆనందంగా ఉందని బాల కృష్ణ చెప్పాడు . 

దర్శకుడు తేజతో ఈ సినిమా ప్రారంభమైంది . అయితే తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ భాద్యత క్రిష్ కు అప్పగించారు . ఈ బయోపిక్ లో అన్నగారి పాత్రలో బాల కృష్ణ నటిస్తున్నాడు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com