'ఉమ్రా' యాత్ర పేరుతో ఘరానా మోసం
- May 28, 2018
కడప: పేద మైనారర్టీలను తక్కువ టికెట్ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడింది. దీంతో ట్రావెల్ ఏజెన్సీ ఎదుట ముస్లింలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తక్కువ టికెట్ ధరతో కడప ఆల్మాస్ పేటలో కేఎస్‌ఎస్ ఉమ్రా ట్రావెల్ ఏజెన్సీ ఒక్కొక్కరి దగ్గర రూ. 30 వేల వరకూ వసూలు చేసింది. డబ్బులు చెల్లినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదనే అనుమానంతో బాధితులు ఆరాదీశారు. వసూలు చేసిన సొమ్ముతో వారు ఉండాయించారనే సమాచారంతో బాధితులు ట్రావెల్ ఏజెన్సీ ఎదుట సోమవారం ఆదోళన చేపట్టారు.
జిల్లాలోని ప్రొద్దుటూరు, కదిరి, మదనపల్లి తదితర ప్రాంతాల వారు ఇందులో మోసపొయ్యారు. బాధితులు ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రొద్దుటూరు పోలీసులు ఏజెన్సీ నిర్వాహకుడు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అలీతో పాటు మరో ముగ్గురిని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ట్రావెల్ ఏజెన్సీ రూ. 200 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..