షియామీ బంపర్ ఆఫర్.. ఫోన్ ఉంటే లక్షరూపాయల లోన్
- May 28, 2018
చైనా దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకర్షించడానికి మరో బంపరాఫర్‌ని ప్రవేశపెట్టింది. ఇకపై తమ వినియోగదారులు లోన్ కోసం ఏ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని లక్షరూపాయల వరకు పర్సనల్ లోన్ మేమే ఇస్తామంటూ తెలియజేసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తామంది. బెంగుళూరుకి చెందిన క్రెజిబి అనే ఫిన్ టెక్ సంస్థతో కలిసి MI క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్టును షియోమి ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా షియోమి వెయ్యి నుంచి లక్షరూపాయిల వరకు ఫోన్ యూజర్లు అప్పుగా అందుకోవచ్చని తెలియజేసింది. మరి ఈ అప్పు పొందాలంటే ఎలానో చూద్దాం..
.. షియోమి కస్టమర్లు ముందుగా MI క్రెడిట్ సర్వీస్‌లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
.. నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
.. పూర్తి చేసిన పది నిమిషాల్లోనే లోన్‌కు మీరు అర్హులా కాదా అన్న మెసేజ్ వస్తుంది.
.. అయితే తీసుకున్న మొత్తాన్ని 15 నుంచి 90 రోజుల మధ్యలో తీర్చేసేయాలి. 3 శాతం వడ్డీతో లోన్ ఉంటుందని షియోమి తెలిపింది.
మొబైల్ రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న షియోమీ భారతీయ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే టీవీలు కూడా విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్‌ని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ క్రెడిట్ స్కీమ్‌ని ప్లాన్ చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







