సలాలాకి ట్రిప్పుల్ని తాత్కాలికంగా నిలిపివేత

- May 28, 2018 , by Maagulf
సలాలాకి ట్రిప్పుల్ని తాత్కాలికంగా నిలిపివేత

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాత్‌, సలాలా వైపుగా వెళ్ళే రూట్లలో ట్రిప్పుల్ని ఆపివేసినట్లు ప్రకటించింది. సైక్లోన్‌ మెకును కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయనీ, ఈ కారణంగానే బస్సుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీసుల సూచన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి వివరాలు ప్రకటించే వరకూ మస్కట్‌ - సలాలా, సలాలా - అల్‌ మజ్యోనా, సలాలా - మర్ముల్‌ రూట్లలో బస్సులు తిరగవు. అయితే దోఫార్‌ అల్‌ వుస్తాలకు నిన్నటినుంచి మవసలాత్‌ బస్సుల్ని పునరుద్ధరించిన సంగతి తెల్సిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com